వాస్తవం ఏమిటో తెలుసుకోకుండా మాట్లాడొద్దన్న రవితేజ !
Published on Jul 5, 2017 3:28 pm IST


రవితేజ సోదరుడు భరత్ కొన్ని రోజుల క్రితం జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆరోజు జరిగిన భరత్ అంత్యక్రియలకు రవితేజ గాని, అతని తల్లిదండ్రులు గాని హాజరుకాకపోవడం సంచలనంగా మారింది. దీనిపై రకరకాల ఊహాగానాలు బయలుదేరాయి. వాటిపై వివరణ ఇవ్వడానికి రవితేజ ఈరోజు మీడియా ముందుకోచ్చారు. రావడంతోనే అసలు వాస్తవమేమిటో తెలుసుకోకుండా వార్తలు ప్రచారం చేయొద్దని యూట్యూబ్ చానెళ్లను రిక్వెస్ట్ చేశారు.

అలాగే తనకు తన తమ్ముడికి మధ్య ఎలాంటి అనుబంధం ఉందో ఎవరికీ తెలీదని, భరత్ మరణ వార్తను విని తన తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారని, ప్రమాదంలో దెబ్బతిన్న అతని ముఖాన్ని చూసే ధైర్యం చేయలేకే తాము అంత్యక్రియలకు రాలేదని కానీ ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా కష్టాల్లో ఉన్నప్పుడు తమ గురించి ఎలా పడితే అలా రాయడం సమంజసం కాదని, కొన్ని యూట్యూబ్ చానెళ్లు పాపులారిటీ కోసం అలా చేస్తున్నాయని, ఎప్పుడైయాన్ వాస్తవం ఏమిటో తెలుసుకుని మాట్లాడాలని అన్నారు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook