ఎస్ ఆర్ టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో రవితేజ హీరోగా నటిస్తోన్న సినిమా నేలటికెట్. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతోంది. బీచ్ లో కొన్ని సన్నివేశాలు ఒక పాట చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. శక్తి కాంత్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్.
మాస్ ఎంటర్టైనర్ గా తెరేకేక్కబోతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించబోతోంది. కళ్యాణ్ కృష్ణ గత రెండు సినిమాలు విలేజ్ నేపద్యంలో నడిచాయి. కాని నేల టికెట్ సినిమా సిటి నేపద్యలో జరిగే ఫ్యామిలి కథగా తెరకేక్కబోతోంది. చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పనిచేస్తున్న ఈ సినిమాను మేలో విడుదల చెయ్యాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.


