మూడు విభిన్నమైన లుక్స్ లో కనిపించనున్న రవితేజ !

మూడు విభిన్నమైన లుక్స్ లో కనిపించనున్న రవితేజ !

Published on Jan 29, 2018 3:44 PM IST

దాదాపు సంవత్సరం పాటు గ్యాప్ తీసుకుని పూర్తిగా లుక్ మార్చి ‘రాజా ది గ్రేట్’ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన మాస్ మహారాజ రవితేజ ఈసారి ఏకంగా మూడు కొత్త లుక్స్ ట్రై చేయనున్నారట. శ్రీను వైట్లతో ఒక సినిమా చేయడానికి గతంలోనే రవితేజ ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ అనే టైటిల్ ను ఖరారు చేశారట.

ఈ చిత్రంలో మూడు పాత్రలుంటాయని, ఈ మూడింటిలోనూ రవితేజ మూడు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం ఏప్రిల్ నుండి మొదలుకానుంది. ఎక్కువ భాగం యూఎస్ లోనే షూట్ జరుపుకోనుంది ఈ సినిమా. ఇకపోతే ఈ రవితేజ నటించిన ‘టచ్ చేసి చూడు’ చిత్రం ఫిబ్రవరి 2వ తేదీన రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

తాజా వార్తలు