మెగా హీరో సినిమా రిలీజ్ డేట్ ఖరారు ?
Published on Oct 26, 2017 3:35 pm IST

తక్కువ కాలంలో మంచి మార్కెట్ సంపాదించుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్. ఆయన గత సినిమాలు ‘తిక్క, విన్నర్’లు ఆశించిన విజయం సాదించనప్పటికి ఈ యువ హీరోకు మంచి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. తాజాగా సాయి నటించిన ‘జవాన్’ సినిమా డిసెంబర్ 1 న విడుదల కానుంది.

‘జవాన్’ తరువాత సాయి, వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆకుల శివ కథ అందించిన ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో బ్రహ్మానందం , సప్తగిరి వంటి స్టార్ కమెడియన్ల ద్వారా ఫుల్ లెంగ్త్ కామెడీని పండించారని సమాచారం. ఫిబ్రవరి 9 న చిత్రాన్ని విడుదల చెయ్యనున్నారు నిర్మాతలు.

 
Like us on Facebook