స్పెషల్ డే రోజున 2.0 టీజర్ !
Published on Dec 6, 2017 12:22 pm IST

లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్రల్లో శంకర్‌ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘2.0’ . ప్రముఖ సంగిత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్ సంగీత సారథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఆడియో వేడుకని ఇటీవల దుబాయ్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా టీజర్ ను జనవరి 26న రిపబ్లిక్ డే సందర్బంగా విడుదల చెయ్యనున్నారు. సుమారు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో యామీ జాక్సన్‌, సుధాన్సు పాండే, అదిల్‌ హుస్సేన్‌ తదితరులు నటిస్తుండడం విశేషం.

 
Like us on Facebook