మెగా హీరో సినిమాకి ముహూర్తం ఖరారైంది !
Published on Mar 13, 2017 10:39 am IST


యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ 2016 లో రెండు సినిమాల్ని మొదలుపెట్టాడు. ఆ రెండింటిలో శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్న ‘మిస్టర్’ చిత్రం ముగింపు దశకు చేరుకుంది. రెండు పాటలు మినహా మిగతా షూట్ అంతా పూర్తయిందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న రిలీజ్ చేయనున్నట్లుగా చిత్ర యూనిట్ ధృవీకరించారు. స్పెయిన్ లో ఎక్కువ భాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం మంచి రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండనుందని తెలుస్తోంది. దర్శకుడు శ్రీను వైట్ల కూడా సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు.

లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు, నల్లమలపు బుజ్జిలు నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, చంద్ర మోహన్, మురళి శర్మ, రఘుబాబు, పృథ్వి వంటి సీనియర్ నటీనటులు నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన రావడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

 
Like us on Facebook