ఇంట్రెస్టింగ్: పుష్ప ట్రైలర్ చూశాక ఆర్జీవీ ఏమన్నాడంటే..!

Published on Dec 7, 2021 3:00 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ “పుష్ప”. పాన్‌ ఇండియన్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుద‌ల చేయ‌నున్నారు. మొదటి భాగం “పుష్ప ది రైజ్” పేరుతో డిసెంబర్ 17వ తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం.
కాగా ఈ సినిమా ట్రైలర్‌పై విలక్షణ దర్శకుడు ఆర్జీవీ స్పందిస్తూ అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురిపించాడు. ఇలాంటి రియలిస్టిక్ పాత్రలో నటించడానికి భయపడని సూపర్ స్టార్ అల్లు అర్జున్ మాత్రమే అని, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, చిరంజీవి, రజినీకాంత్ మొదలైన వారు ఇలాంటి పాత్రలు చేయగలరా అని సవాల్ చేస్తున్నట్టు ట్వీట్ చేశాడు. అయితే పుష్ప అంటే ప్లవర్ కాదు.. ఫైర్ అని సినిమాలోని డైలాగ్‌ని రాసుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :