నార్త్ సినిమా పై ఆర్జీవీ సెన్సేషనల్ కామెంట్స్!

Published on May 13, 2022 2:00 pm IST


వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి సౌత్ మరియు నార్త్ సినిమాల పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో సౌత్ సినిమాలు పాన్ ఇండియా మూవీస్ గా విడుదల అయ్యి సూపర్ సక్సెస్ ను అందుకుంటున్నాయి. నార్త్ సినిమాలు ఊహించిన రీతిలో బాక్సాఫీస్ వద్ద నిలబడలేక పోతున్నాయి. అదే విషయాన్ని తనదైన శైలి లో చెప్పారు వర్మ.

సౌత్ సినిమాలు థియేటర్స్ లో వెళ్తున్నట్లు అనిపించినా, నార్త్ సినిమాలు అలా లేవు అని అన్నారు. అంతేకాక బాలీవుడ్ లో త్వరలో ఓటిటి కోసమే సినిమాలు తీయాలని అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు వర్మ. వర్మ చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం :