తమిళ రాజకీయాలపై స్పందించిన వర్మ !
Published on Feb 8, 2017 6:05 pm IST


ఈ మధ్యే పలువురు తెలుగు టాప్ హీరోలపై ట్విట్టర్లో ట్వీట్లు వేసి హాట్ టాపిక్ గా మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా తమిళ రాజకీయాలపై కూడా తనదైన శైలిలో స్పందించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పదవి కోసం పన్నీర్ సెల్వమ్, శశికళల మధ్య జరుగుతున్న నాటకీయ పరిణామాల దుష్ట్యా వర్మ వేసిన ట్వీట్ నేరుగా పన్నీర్ సెల్వాన్ని ఉద్దేశించి వేసినట్టే ఉంది.

పన్నీర్ సెల్వమ్ రాజీనామా అనంతరం దివంగత జయలలిత తన కల్లోకి వచ్చి రాష్ట్రాన్ని, పార్టీని కాపాడమని చెప్పారని అందుకే ఈ పోరాటం చేస్తున్నాని అన్నారు. దాన్ని హైలెట్ చేస్తూ వర్మ ‘జయలలిత పన్నీర్ సెల్వం కల్లోకి వచ్చి నువ్వే ముఖ్యమంత్రిగా ఉండు అని చెప్పిందట. అంటే అక్కడ మోదీ భూత వైద్యుడా ? తమిళ రాజకీయాల్ని చూస్తుంటే పొలిటికల్ హర్రర్ సినిమా చూస్తున్నట్లుంది’ అన్నారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా నడుస్తోంది. ఇకపోతే వర్మ గతంలోనే శశికళ జీవితంపై సినిమా తీస్తానని ప్రకటించిన నైపథ్యంలో ఈ రాజకీయ పరిణామం ఆయనకు బాగా ఉపకరిస్తుంచే అవకాశముంది.

 
Like us on Facebook