గాడ్సే మీద సినిమా తీసేందుకు రెడీ అవుతున్న వర్మ !
Published on May 14, 2017 1:31 pm IST


కాంట్రవర్షియల్, నేర సంబంధిత వాస్తవ ఘటనల ఆధారంగా సినిమాలు తీయడంలో ఎప్పుడో ముందుండే వర్మ తాజాగా మరో సంచలనాత్మక ప్రాజెక్టుకు సిద్దమవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ గాంధీని చంపిన గాడ్సే జీవితం ఆధారంగా ఉండబోతోందట. ఈ విషయాన్ని ‘సర్కార్ -2’ ప్రమోషన్లలో భాగంగా జరిగిన ఒక మీడియా సమావేశంలో వర్మ స్వయంగా తెలిపారు.

‘గాంధీని షూట్ చేసేప్పుడు గాడ్సే మైండ్ లో ఎలాంటి ఆలోచనలో ఉన్నాయో తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉండేది. ఆ ఆలోచనే అతని గురించి ఇంకా ఎక్కువ తీసుకోనేలా చేసింది. ఇలాంటి చారిత్రక ఘటనల మూలంగా సినిమాలు తీయాలనే నేనుకుంటున్నాను. ప్రస్తుతం గాడ్సే గురించి వివరాలు సేకరించే పనిలో ఉన్నాను’ అని వర్మ అన్నారు.

 
Like us on Facebook