తెలంగాణాలో సినీ పరిశ్రమ ఏర్పడాలి – ఆర్జీవీ


ఏ విషయం పైన అయినా తనకు స్పందించాలని ఉంటే వెంటనే తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెబుతాడు విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఏ విషయాన్నైనా సరే ముక్కుసూటిగా చెప్పడం ఆయనకు అలవాటు. రీసెంట్ గా అర్జున్ రెడ్డి సినిమాపై ఆయన చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం.

అర్జున్ రెడ్డి సినిమా చూసిన రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి మెగాస్టార్ దొరికాడని చెప్పడం, విజయ్ దేవరకొండ నటనలో పవన్ కళ్యాణ్ కన్నా 20 రెట్లు బెటర్ అని అనడం చర్చనీయాంశం అయింది.

ఆర్జీవి ఇంతటితో ఆగకుండా, రీసెంట్ గా మరో కామెంట్ చేశారు. అర్జున్ రెడ్డి సినిమా విజయంతో తెలంగాణాలో సినీ పరిశ్రమ ఏర్పడబోతోందని, ఈ సినిమా తెలంగాణ భాషలో ఇంకా సినిమాలు తీసే బలాన్ని ఇచ్చిందని, ఇక్కడి (తెలంగాణ) దర్శకులు, నటులు కొత్తగా ట్రై చేస్తున్నారని కామెంట్ చేశారు. అదే విధంగా కేసీఆర్, కేటీఆర్ కి ఒక విన్నపం కూడా చేస్తారు. తెలంగాణాలో ఉన్న యువతను గుర్తించి వారికి అవకాశాలు ఇస్తే వాళ్ళ టాలెంట్ ను చూపిస్తారని చెప్పారు. తెలంగాణలో ఒక ఫిలిం ఇండస్ట్రీ ఏర్పడితేనే వారికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పడుతుందని పోస్ట్ చేశారు. ఆర్జీవి చేసిన ఈ వ్యాఖ్యల పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.