ఆ వ్యక్తిని వెతికి పట్టుకుంటే లక్ష రూపాయలు ఇస్తా – రామ్ గోపాల్ వర్మ

Published on Oct 13, 2018 4:29 pm IST


ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతగా వైరల్ అవుతుంది అంటే.. అతనేదో పెద్ద సెలెబ్రెటీ అనుకున్నేరూ..! అతను కేవలం ఓ సాదాసీదా హోటల్ లో పనిచేసుకున్నే వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి వీడియా ఎందుకు వైరల్ అవుతుంది అంటారా..? అతనికి, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకి దగ్గర పోలికలు ఉన్నాయి. దీంతో అతనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.

అయితే రామ్ గోపాల్ వర్మ ఈ వీడియా పోస్ట్ చేస్తూ.. ‘వీడియోలోని ఈ వ్యక్తిని వెతికి పట్టుకొన్నే విషయంలో నాకు సాయం చేస్తారా.? అతన్ని నా దగ్గరకి తీసుకువచ్చిన వారికి లక్ష రూపాయలను అందిస్తా’ అని వర్మ పోస్ట్ చేశాడు. వర్మ ప్రస్తుతం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాను తెరకెక్కించాలనే ఉద్దేశ్యంలో ఉన్నాడు.

సంబంధిత సమాచారం :