ఇంటర్వ్యూ : సందీప్ కుమార్ (శాండీ) : వర్మ ఉన్నారు కాబట్టి భయం వేయలేదు !
Published on Dec 28, 2016 12:40 pm IST

sandy-2
రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం ‘వంగవీటి’లో వంగవీటి రాధా, రంగల పాత్రలు పోషించి అద్భుతమైన నటనతో అందరి దృష్టినీ ఆకర్షించిన నటుడు సందీప్ కుమార్ అలియాస్ శాండీ. ఈ ఒక్క సినిమాతోనే పాపులరైన ఆయన చిత్ర విజయాంనందాన్ని, ఇతర విషయాల్ని మీడియాతో పంచుకున్నారు. ఆ విశేషాలు మీ కోసం…

ప్ర) చెప్పండి శాండీ మీ సినిమాని రెస్పాన్స్ ఎలా ఉంది ?
జ) రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. సినిమా చూసిన వాళ్లంతా సినిమాతో పాటు నన్ను కూడా మెచ్చుకుంటున్నారు. నా గాడ్ ఫాదర్ పూరిగారు కూడా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు.

ప్ర) రాధ, రంగ పాత్రల్లో దేనికి మంచి పేరొచ్చింది?
జ) ముందుగా సినిమా చూసిన వాళ్లంతా రాధ పాత్ర చాలా బాగుందని, ఆ తరువాత రంగా క్యారెక్టర్ నచ్చిందని అంటున్నారు.

ప్ర) అసలు ఈ అవకాశం ఎలా వచ్చింది ?
జ) నేను పూరిగారి ఆఫీస్ లో ఉన్నపుడు వర్మగారు నన్ను చూసి ఇలా నీతో సినిమా తీయాలనుకుంటున్నాను. కథ ఇది నువ్వు చేయగలవా అన్నారు. నేను ఓకే చెప్పి లుక్ మార్చుకుని లుక్ టెస్టుకు వెళ్ళా. అక్కడ వర్మగారు నన్ను ఫైనల్ చేశారు.

ప్ర) వర్మ ఈ కథ చెప్పినప్పుడు చేస్తే తరువాత ఏం జరుతుందో అని భయం వేయలేదా ?
జ) సినిమా తీసేది వర్మగారు కాబట్టి భయం వేయలేదు. అసలు నాకు అలాంటి ఆలోచనే రాలేదు. వర్మగారు అడగ్గానే వెంటనే ఓకే చెప్పేశా.

ప్ర) వంగవీటి రాధ, రంగల పాత్రల కోసం ఎలాంటి హోమ్ వర్క్ చేశారు ?
జ) వర్మగారు కథ చెప్పగానే ముందు రాధా పాత్ర గురించి నెట్లో రీసెర్చ్ చేశాను. తరువాత నా సర్కిల్ లో ఉన్న వాళ్ళను కూడా కనుక్కొని వర్క్ చేశాను. ఇక రంగాగారి పాత్ర గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ తెలీలేదు. కేవలం ఫోటోస్ మాత్రమే దొరికాయి. వాటిని చూసే ఆయన ఎలా కూర్చుంటారు, నడుస్తారు అనేది ప్రాక్టీస్ చేశా.

ప్ర) మీ బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్తారా ?
జ) మాది కాకినాడ. నేను బీఎస్సీ చదివాను. తరువాత హైదరాబాద్ వచ్చేశాను. చిన్నప్పటి నుండి సినిమాలంటే ఇష్టం ఉండటం వలన స్టేజ్ షోలు చేస్తూ ఉండేవాడిని.

ప్ర) మీరు ఇంతకు ముందు చేసిన సినిమాలేవిటి ?
జ) నెను ఫస్ట్ ఒక స్పానిష్ ఫిలింలో చిన్న రోల్ చేశాను. ముంబై ఆడిషన్ కంపెనీ ద్వారా ఆ ఛాన్స్ వచ్చింది. తరువాత పూరిగారి జ్యోతి లక్ష్మి, లోఫర్ లాంటి సినిమాల్లో చేశాను.

ప్ర) సినిమా రిలీజయ్యాక విజయవాడ వెళ్ళారా ?

జ) వెళ్ళలేదు. కొన్ని పనులుండటం వలన ఇక్కడే ఉండాల్సి వచ్చింది.

ప్ర)నెక్స్ట్ ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు ?

జ) అంటే పలానా పాత్రలని కాకుండా కథ బాగుండి, మంచి డైరెక్టర్ ఉంటే ఎలాంటి సినిమా అయినా చేస్తాను. బయోపిక్స్, కమర్షియల్ సినిమాలు అన్నింటిలోనూ నటించాలని అనుకుంటున్నాను.

ప్ర) మీ ప్రొడ్యూసర్ ఎలా సహాయపడ్డారు ?
జ) మా ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ కుమార్ గారు చాలా బాగా హెల్ప్ చేశారు. ఏది కావాలన్నా చేసేవారు. సినిమా అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన వలనే సినిమా ఇంత బాగా వచ్చింది.

 
Like us on Facebook