ప్రేక్షకులతో కలిసి సినిమా చూడబోతున్న “రొమాంటిక్” టీమ్.. ఎక్కడెక్కడంటే..!

Published on Oct 28, 2021 11:22 pm IST


డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి, కేతికా శర్మ కలిసి నటించిన చిత్రం “రొమాంటిక్”. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కలిసి నిర్మించిన ఈ చిత్రానికి పూరి శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమా రేపు గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.

అయితే మంచి అంచనాల మధ్య రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను ప్రేక్షకులతో కలిసి చూసేందుకు “రొమాంటిక్” టీమ్ రెడీ అయ్యింది. అయితే రేపు మార్నింగ్ షో 11:00 గంటలకు సంధ్య థియేటర్-ఆర్టీసీ క్రాస్ రోడ్స్, మ్యాట్నీ షో 2:00 గంటలకు శివ పార్వతి-కూకట్‌పల్లి, ఫస్ట్ షో 6:30 మెగా-దిల్‌సుఖ్‌నగర్‌లో “రొమాంటిక్” టీమ్ సందడి చేయనుంది.

సంబంధిత సమాచారం :

More