అక్కడ గట్టిగానే వసూళ్లను రాబడుతోన్న “RRR”…14 మిలియన్ డాలర్ల కి చేరువలో!

Published on Apr 14, 2022 1:02 am IST

జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించిన చిత్రం రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ చిత్రం అన్ని చోట్ల మంచి వసూళ్ళను రాబడుతోంది.

ఇప్పటి వరకూ ఈ చిత్రం నార్త్ అమెరికా లో 13.75 మిలియన్ డాలర్ల కి పైగా వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. 14 మిలియన్ డాలర్ల వైపుకి పరుగులు తీస్తూ రికార్డు లను క్రియేట్ చేస్తుంది ఈ చిత్రం. అలియా భట్, ఒలివియా మోరిస్, శ్రియ శరణ్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించగా, ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో ఏ తరహా వసూళ్లను రాబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :