వైరల్ అవుతున్న “RRR” ఫైనల్ రన్ టైం.!

Published on Nov 27, 2021 8:00 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ యాక్షన్ మరియు ఎమోషనల్ ఎంటర్టైనర్ “RRR”. అంతకంతకూ మంచి అంచనాలు నెలకొల్పుకుంటూ వెళుతున్న ఈ చిత్రం నుంచి వచ్చిన ఎమోషనల్ సాంగ్ “జనని” కి అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ కూడా స్టార్ట్ అయ్యింది.

అయితే ఈ బిజీ ప్రమోషన్స్ లోనే ఈ సినిమాకి సంబంధించిన మరింత సమాచారం బయటకి వచ్చింది. మరి ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ అవ్వడమే కాకుండా ముందు అనుకున్నట్టుగానే పెద్ద రన్ టైం నే వచ్చిందట. మొదట దాదాపు మూడు గంటల రన్ టైం వస్తుంది అనుకుంటే ఏకంగా 3 గంటల 6 నిమిషాల రన్ టైం ఈ చిత్రానికి వచ్చిందట. ఇప్పుడు ఇదే వైరల్ అవుతుంది. ఇక కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం వచ్చే జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :