ఎన్టీఆర్ ఎమోషనల్ సీన్స్…రామ్ చరణ్ యాక్షన్ సీన్స్ !

Published on Feb 24, 2019 8:55 pm IST

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కతుంది. కాగా రామ్ చరణ్ యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన సినిమాలోనే హైలెట్ గా నిలుస్తాయట. అలాగే ఎన్టీఆర్ పాత్రకు సంబధించి ఎమోషనల్ సన్నివేశాలు కూడా బాగా హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది.

ఇక ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్ టైన్మెంట్స్ పతాకం ఫై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు.

సంబంధిత సమాచారం :