అరవింద సమేత రన్ టైం లాక్ !

Published on Oct 8, 2018 8:28 pm IST

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత’ చిత్రం ఫై అంచనాలు భారీ స్థాయిలో వున్నాయి. ఈరోజు ఈచిత్రం సెన్సార్ కార్యక్రమాలను ముగించుకుంది. ఇక ఈచిత్రం యొక్క నిడివి కొంచెం ఎక్కువగానే వుంది. 167నిమిషాల రన్ టైంతో ప్రేక్షకులముందుకు రానుంది ఈచిత్రం.

ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించగా తమన్ సంగీతం అందింస్తున్నాడు. అక్టోబర్ 11న భారీ స్థాయిలో విడుదలవుతున్న చిత్రం బాక్సాఫిస్ రికార్డులను తిరుగరాస్తుందని ఎన్టీఆర్ అభిమానులు చాలా ధీమా గా వున్నారు.

సంబంధిత సమాచారం :