‘సాహో’ సైన్స్ ఫిక్షన్ మూవీ కాదట !
Published on Jul 31, 2017 8:34 am IST


‘బాహుబలి’ తర్వాత ప్రబస్ నటిస్తున్న చిత్రం కావడంతో ‘సాహో’ పై అన్ని పరిశ్రమల ప్రేక్షకుల్లో భారీ స్థాయి అంచనాలున్నాయి. అంతేగాక టీజర్ లోని గ్రాఫిక్స్ చూసిన ప్రేక్షకులంతా సినిమా ఒక సైన్స్ ఫిక్షన్ మూవీలా ఉంటుందని ఊహించారు. కానీ సినిమా అలా ఉండదట. కానీ అందులో హై టెక్నాలజీ ఉంటుందని, ఎక్కువ యాక్షన్ పార్ట్ పైనే దృష్టి పెట్టామని రెబల్ స్టార్ ప్రభాస్ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

అలాగే సినిమాలోని యాక్షన్ సీక్వెన్సులను హాలీవుడ్ కొరియోగ్రాఫర్లతో షూట్ చేశామని, అభిమానులకు మంచి ఐ ట్రీట్ ఉంటుందని చెప్పుకొచ్చారు ప్రభాస్. సుజీత్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో పలువురు బాలీవుడ్ నటులు కూడా నటిస్తుండగా హీరోయిన్ ఎవరనేది ఇంకా తేలలేదు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను యువీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది.

 
Like us on Facebook