సంతోష ఆంజనేయులు సమర్పణలో శ్రీలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకం పై రాజ్, షాలు హీరోహీరోయిన్లుగా ఆది అరవల దర్శకత్వంలో కావాలిరాజు నిర్మించిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రణస్థలం”. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విద్యాశాఖ మాత్యులు సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా నేడు హైదరాబాద్ లో విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత కావలి రాజు, దర్శకుడు ఆది అరవల , సంగీత దర్శకుడు రాజకీరణ్, కెమెరా మెన్ ప్రభాకర్, లిరిక్ రైటర్ రామారావు,కో డైరెక్టర్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ” ఈ సినిమా “మా ప్రాంతం వారు తీసినందుకు గర్వపడుతున్నాను. ప్రొడ్యూసర్ రాజు చిన్న స్టేజ్ నుండి ఈ రోజున సినిమాలు నిర్మించే స్థాయికి ఎదగడం సంతోషం గా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’అన్నారు. చిత్ర దర్శకుడు ఆది అరవల మాట్లాడుతూ ‘ఈ సినిమాకి కథే హీరో. మంచి కథతో ముందుకు వెళ్ళాం. చక్కటి అవుట్ ఫుట్ తో ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం’ అన్నారు. చిత్ర నిర్మాత కావాలి రాజు మాట్లాడుతూ’ మా సినిమా ఫస్ట్ లుక్ ను మంచి మనసున్న మా మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు రిలీజ్ చేయడం ఆనందం గా ఉంది. ఈ సందర్భంగా మా సబితమ్మకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.’అన్నారు.


