విషాదం : ‘చిరుత”, “టక్ జగదీష్” నటుడు కన్నుమూత

విషాదం : ‘చిరుత”, “టక్ జగదీష్” నటుడు కన్నుమూత

Published on Mar 30, 2024 7:05 AM IST

మన సౌత్ ఇండియా సినిమా దగ్గర పలు తక్కువ చిత్రాల్లోనే కనిపించినప్పటికీ విలన్ గా తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న టాలెంటెడ్ నటుల్లో కోలీవుడ్ నటుడు డానియల్ బాలాజీ కూడా ఒకరు. మరి టాలీవుడ్ లో మెగాపవర్ స్టార్ రాం చరణ్ నటించిన డెబ్యూ చిత్రం “చిరుత” లోనే విలన్ పాత్రలో ఆకట్టుకున్న తాను మళ్లీ నేచురల్ స్టార్ నాని “టక్ జగదీష్”లో విలన్ గా మెప్పించాడు. అయితే అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఫిజికల్ గా కూడా తనలో పెద్దగా ఎలాంటి మార్పు లేదు.

మరి అలాంటిది ఈ నటుడు ఇప్పుడు లేడు అనే వార్త విషాదంగా మారింది. తాను నిన్న శుక్రవారం రాత్రి గుండెపోటు కారణంగా కేవలం తన 48వ ఏట కన్ను మూసినట్టుగా తమిళ వర్గాలు ఖరారు చేసాయి. మరి చెన్నై లోని కొట్టివాకమ్ ఆసుపత్రిలో తాను చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు అని తెలుస్తోంది. దీనితో ఈ వార్త విన్న వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. మరి తన అకాల మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు. మరి తన పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మా 123తెలుగు యూనిట్ కూడా ఆకాంక్షిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు