ఆ దర్శకుడితో మాస్ మూవీకి రెడీ అవుతున్న సాయి ధరమ్ తేజ్..!

Published on Dec 20, 2021 11:55 pm IST


మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రీసెంట్‌గా “రిపబ్లిక్” సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. దేవకట్టా దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల నుండి, ప్రేక్షకుల నుండి ప్రశంసలు దక్కించుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్‌కి ముందు యాక్సిడెంట్ బారిన పడిన సాయి తేజ్ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడని, ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్‌లపై ఫోకస్ పెట్టాడని తెలుస్తుంది.

అయితే ఇప్పటివరకు యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే సినిమాలు చేస్తూ వస్తున్న సాయి తేజ్ ఓ పక్కా మాస్ సినిమాను చేసేందుకు నిర్ణయించుకున్నాడట. ‘రచ్చ’, ‘బెంగాల్ టైగర్’ వంటి మాస్ సినిమాలతో హిట్స్ అందుకున్న సంపత్ నంది దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఆ సినిమాను చేస్తున్నాడట. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని, త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన రానుందని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :