డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రధాన పాత్రలో ఆనంద్, శ్రీ పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం వన్ బై టు. చెర్రీ క్రియేటివ్ వర్క్స్ పతాకం పై కరణం శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దారం ప్రభుదాస్ సమర్పకులు గా వ్యవహరిస్తున్నారు. వన్ బై టు చిత్రానికి శివ ఏటూరి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తాజాగా వన్ బై టు సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.
టీజర్ లో సాయికుమార్ ని చాలా పవర్ ఫుల్ గా చూపించారు. ఎవరైనా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వాళ్ళను శిక్షించే పాత్రలో సాయికుమార్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. అమ్మాయిలపై యాసిడ్ దాడులు మరియు పసిపిల్లల పై అత్యాచారం వంటి సంఘటనలకి ఇందులో చూపించిన పరిష్కారం చాలా వైల్డ్ గా ఉంది. విజయ భారతి (సుదర్శన్ కరమల) రాసిన ఆడవాళ్ళ జోలికొస్తే తగలెట్టేస్తా, నేను ఎంటరైతే విశ్వరూపమే లాంటి సాలీడ్ డైలాగ్స్ చాలా ఆకట్టుకుంటున్నాయి అని చెప్పాలి. వన్ బై టు వుమెన్ ప్రొటెక్షన్ గురించి రూపొందించిన ఓ పవర్ ఫుల్ మూవీ అని టీజర్ తో అర్థమవుతోంది.
షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఈ వన్ బై టు చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు కన్నడ, హిందీలో కూడా డబ్బింగ్ చేసి థియేటర్ లలో విడుదల చేయబోతున్నారు. త్వరలో చిత్ర బృందం విడుదల తేదీని ప్రకటించనున్నారు.
ట్రైలర్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి


