ప్రభాస్ “సలార్” రిలీజ్ అయ్యేది అప్పుడేనా?

Published on Mar 25, 2022 3:00 am IST


పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌తో “సలార్” సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. హోంబలే ఫిలింస్‌ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్న ఈ చిత్రానికి సంబంధించి హోంబాలే ఫిలిమ్స్ అధినేత, నిర్మాత విజయ్ కిరగండూర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

అయితే ఇప్పటికే సలార్ సినిమా 30 శాతం షూటింగ్‌ని పూర్తిచేసుకుందని, మిగతా షూటింగ్ మేలో మొదలుకానుందని అన్నారు. ఇక ఈ ఏడాది చివరిలోపు షూటింగ్‌ని పూర్తిచేసి, 2023 ఏప్రిల్‌లో కానీ, జూన్‌లో కానీ సినిమాను రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు. ఇక ఎట్టకేలకు సినిమా రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ రావడంతో ప్రభాస్ అభిమానులు వచ్చే ఏడాది కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :