‘రంగస్థలం’ లో రామలక్ష్మిగా సమంత !

8th, February 2018 - 06:11:53 PM

స్టార హీరోయిన్ సమంత రామ్ చరణ్ యొక్క ‘రంగస్థలం’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్ననే తన పాత్ర తాలూకు షూటింగ్ ముగించిన ఆమె ప్రస్తుతం విహారంలో విశ్రాంతి తీసుకుంటోంది. గ్రామీణ నైపథ్యంలో ఉండనున్న ఈ చిత్రంలో సమంత పాత్ర ఎలా ఉంటుందో చూడాలని ఆమె అభిమానుల్లో, ప్రేక్షకుల్లో మొదటి నుండి ఆసక్తి నెలకొంది ఉంది. దానికి తోడు ఇటీవల బయటికొచ్చిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ పాత్ర పట్ల ప్రేక్షకుల ఆతురతను ఇంకాస్త పెంచాయి.

తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమలో సమంత పాత్ర పేరు రామలక్ష్మి అని, రేపు 11 గంటలకి ఆమెను కలుసుకోండి అని ప్రకటించింది. దీన్నిబట్టి గతంలో చరణ్ పాత్రను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన టీజర్ లాగానే రేపు సమంత పాత్రను వివరిస్తూ ఇంకో టీజర్ ను విడుదలచేస్తారేమోననిపిస్తోంది. మరి మన రామలక్ష్మి రేపు ఎలా సందడి చేస్తుందో చూడాలి. సుకుమార్ దర్శకత్వంలో చాలా కాలం పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకురానుంది.