‘సిటాడెల్’ సిరీస్ పై సమంత అప్ డేట్

‘సిటాడెల్’ సిరీస్ పై సమంత అప్ డేట్

Published on Jan 31, 2024 1:07 AM IST

టాలీవుడ్ స్టార్ నటీమణుల్లో ఒకరైన సమంత రూత్ ప్రభు తాజాగా నటిస్తున్న సిరీస్ సిటాడెల్. ఇందులో ఆమెకు జోడీగా వరుణ్ ధావన్ నటిస్తున్నారు. ఇటీవల హాలీవుడ్ లో రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించిన అమెరికన్ సిరీస్ సిటాడెల్ కి ఇది అఫీషియల్ రీమేక్. సమంత, మనోజ్ బాజ్ పాయ్ ల ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ని తెరకెక్కించిన రాజ్ మరియు డీకే సిటాడెల్ ని కూడా తెరకెక్కిస్తుండడం విశేషం.

విషయం ఏమిటంటే, తాజగా ఈ సిరీస్ కి డబ్బింగ్ చెప్తున్న పిక్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు సమంత. లెట్స్ గో అంటూ ఫైర్ ఎమోజిలతో సమంత పెట్టిన ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ స్పై థ్రిల్లర్ లో సికందర్ ఖేర్, ఎమ్మా కానింగ్, కే కే మీనన్, సాకిబ్ సలీం ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. త్వరలో ఈ సిరీస్ ఎప్పుడు రిలీజ్ కానుంది అనే దానిపై మేకర్స్ నుండి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు