సమంత “యశోద” శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్న ఈ ప్రముఖ ఛానెల్‌?

సమంత “యశోద” శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్న ఈ ప్రముఖ ఛానెల్‌?

Published on Jan 20, 2023 1:02 AM IST

స్టార్ నటి సమంత ఇటీవల యశోదతో మంచి హిట్ కొట్టారు. సమంత అనారోగ్యానికి గురైన తర్వాత, నటిగా తెరపైకి వచ్చిన మొదటి చిత్రం ఇదే. ఈ చిత్రం థియేటర్లలో రిలీజై మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. హరి, హరీష్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది. తాజాగా ఈ సినిమా శాటిలైట్ హక్కులను ప్రముఖ ఎంటర్టైన్‌మెంట్ ఛానెల్ ఈటీవీ సొంతం చేసుకుంది.

ఈ చిత్రం త్వరలో బుల్లితెర పై ప్రసారం కానుంది. ఉన్ని ముకుందన్, రావు రమేష్, వరలక్ష్మి శరత్‌కుమార్, మురళీ శర్మ, సంపత్ రాజ్, కల్పిక తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. యశోదలో యాక్షన్ పార్ట్ కోసం సమంత తీవ్ర పోరాటం చేసింది, ఆమె ప్రయత్నాలన్నీ సినిమా విజయంతో ఫలించాయి. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు