ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “సప్త సాగరాలు దాటి – సైడ్ బి”

ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “సప్త సాగరాలు దాటి – సైడ్ బి”

Published on Jan 26, 2024 1:00 PM IST

రీసెంట్ గా కన్నడ సినిమా దగ్గర వచ్చి మంచి హిట్ అయ్యిన చిత్రాల్లో దర్శకుడు ఎం హేమంత్ రావు తెరకెక్కించిన ఎమోషనల్ ప్రేమ కథా చిత్రం “సప్త సాగరాలు దాటి” కూడా ఒకటి. మరి టాలెంటెడ్ హీరో రక్షిత్ శెట్టి హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా అయితే తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ ని అందుకుంది.

ఇక దీనికి సీక్వెల్ “సప్త సాగరాలు దాటి సైడ్ బి” ని కూడా తెలుగులో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా పార్ట్ 1 ని మించి పెద్ద హిట్ కాలేదు. మరి ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడు గుడ్ న్యూస్ వచ్చింది. ఈ సినిమా లేటెస్ట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కన్నడ తెలుగు సహా ఇతర సౌత్ భాషల్లో అయితే స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి ఈ చిత్రాన్ని చూడాలి అనుకునేవారు ఇప్పుడు చూడవచ్చు. అలాగే ఈ చిత్రంలో మరో నటి చైత్ర జే ఆచార్ కూడా మరో హీరోయిన్ గా నటించగా రక్షిత్ శెట్టి నిర్మాణం కూడా వహించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు