బుల్లితెర ఫై రికార్డు సృష్టించిన సర్కార్ !

Published on Feb 7, 2019 3:05 pm IST

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘సర్కార్’ గత ఏడాది విడుదలై 200కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగులో కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ఇక తాజాగా ఈ చిత్రం బుల్లితెర ఫై కూడా రికార్డు సృష్టించింది. ఇటీవల ఈ చిత్రాన్ని సన్ టీవీ ప్రసారం చేయగా సౌత్ నుండి హైయెస్ట్ వ్యూవర్ షిప్ (టివిఆర్ ) ను రాబట్టిన 3వచిత్రంగా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ జాబితాలో పిచ్చకారన్ (బిచ్చగాడు) , బాహుబలి మొదటి, రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

ఇక సర్కార్ 16.9 మిలియన్ల వ్యూవర్ షిప్ రాబట్టిందని బిఏఆర్కె అధికారికంగా ప్రకటించింది. పొలిటికల్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది.

సంబంధిత సమాచారం :