అక్కడ కబాలి తరువాత సర్కారే !

అక్కడ కబాలి తరువాత సర్కారే !

Published on Oct 10, 2018 12:12 AM IST

sarkar

ఇళయదళపతి విజయ్ నటించిన ‘సర్కార్’ చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. ‘తుపాకి,కత్తి’ చిత్రాల తరువాత విజయ్ – మురుగదాస్ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంఫై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకు తగ్గట్లే ఈచిత్రం యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతుంది.

ఇక ఈచిత్రం యొక్క కర్ణాటక థియేట్రీకల్ హక్కులు 8కోట్లకు అమ్ముడయ్యాయి. శ్రీ గోకుల్ ఫిలిమ్స్ ఈ హక్కులను దక్కించుకుంది. విజయ్ సినిమాకు అక్కడ ఇంత భారీ ధర రావడం ఇదే మొదటిసారి. ఓవరాల్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కబాలి’ చిత్రం తరువాత కర్ణాటకలో ఈరేంజ్ లో బిజినెస్ చేసిన చిత్రం ఇదే కావడం విశేషం.

సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈచిత్రంలో విజయ్ కి జోడిగా కీర్తి సురేష్ నటించగా, ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈచిత్రం నవంబర్ 6న విడుదలకానుంది.

తాజా వార్తలు