కలెక్షన్స్ రిపోర్ట్ : 50 కోట్ల ‘సరైనోడు’..!
Published on May 2, 2016 10:56 pm IST

sarrinodu
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో వచ్చిన సరైనోడు సినిమా ఎవరి ఊహకూ అందకుండా, బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్స్ సాధిస్తూ సూపర్ హిట్‌గా నిలిచింది. మొదటిరోజు అన్నిచోట్లా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా ఈ స్థాయిలో మెప్పిస్తూ ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాకు టార్గెట్ ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పదిరోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సరైనోడు సినిమా 53.78 కోట్ల రూపాయల వసూళ్ళు సాధించి బన్నీ కెరీర్‌కు బిగ్గెస్ట్‌‍ హిట్‌గా నిలిచింది.

నైజాం, ఆంధ్ర, సీడెడ్, కర్ణాటక.. ఇలా అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఒక్క నైజాంలోనే మొదటి పదిరోజుల్లో 13.97 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి ‘సరైనోడు’ పేరు నిలబెట్టుకున్నాడు. ఇక ప్రాంతాల వారీగా మొదటి వారం కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి..

ఏరియా
కలెక్షన్స్ (షేర్)
నైజాం 13.97 కోట్లు
సీడెడ్ 8.18 కోట్లు
కృష్ణా 2.84 కోట్లు
గుంటూరు 3.87 కోట్లు
నెల్లూరు 1.64 కోట్లు
తూర్పు గోదావరి 3.53 కోట్లు
పశ్చిమ గోదావరి 3.10 కోట్లు
వైజాగ్ 5.35 కోట్లు
కర్ణాటక 6.25 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.10 కోట్లు
ఓవర్సీస్ 3.95 కోట్లు
మొత్తం 53.78 కోట్లు

 
Like us on Facebook