చిరు “వాల్తేరు వీరయ్య” శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ టీవి ఛానల్!

చిరు “వాల్తేరు వీరయ్య” శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ టీవి ఛానల్!

Published on Jan 7, 2023 2:15 AM IST


మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్య. ఈ చిత్రం లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, మాస్ మహారాజా రవితేజ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. జనవరి 13, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ టివి ఛానల్ జెమిని టీవీ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ అనంతరం జెమిని టీవీ లో ప్రసారం కానుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు