సూర్య సినిమాలో ప్రతినాయకుడిగా తెలుగు సీనియర్ హీరో ?

తెలుగు సీనియర్ హీరోల్లో ఒకరైన జగపతిబాబు కాలానుగుణంగా పంధా మార్చి ప్రతినాయకుడి పాత్రలు, కీలకమైన సపోర్టింగ్ రోల్స్ చేస్తూ కెరీర్లో దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘లెజెండ్, భైరవ, లింగా, పులి మురుగన్’ లాంటి సినిమాలాటి పలు భాషల్లో విలన్ గా పేరు తెచ్చుకున్న ఈ సీనియర్ నటుడు ఇప్పుడు మరొక స్టార్ హీరోకి ప్రతినాయకుడిగా నటించనున్నారని వినికిడి.

ఆ హీరోనే సూర్య. ప్రస్తుతం సూర్య సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలోని బలమైన విలన్ రోల్ కోసం జగపతిని సంప్రదించారని, ఆయన కూడా పాత్ర నచ్చడంతో చేయడానికి సుముఖంగా ఉన్నారని వినికిడి. అయితే ఈ విషయమై ఇంకా అధికారిక సమాచారం వెలువడలేదు. ఇప్పటికే చెన్నైలో ఒక షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి మధ్య నుండి రెండవ షెడ్యూల్ ను మొదలుపెట్టుకోనుంది. ఈ చిత్రంలో సూర్య సరనస రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవిలు నటిస్తున్నారు.