సాయంత్రం రిలీజ్ కానున్న సంచలన దర్శకుడి సినిమా టీజర్ !
Published on Mar 7, 2018 3:38 pm IST

‘పిజ్జా, జిగర్తాండ, ఇరైవి’ వంటి విభిన్నమైన సినిమాలతో దక్షిణాదిన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సంచలన యువ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ చేసిన తాజా చిత్రం ‘మెర్కురి’. నిశ్శబ్దమే అన్నికన్నా బలమైన కేక’ అనే డిఫరెంట్ ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సైలెంట్ థ్రిల్లర్ లో ప్రభుదేవ ప్రధాన పాత్ర పోషించారు.

తెలుగులో సైతం రిలీజ్ కానున్న ఈ చిత్రం యొక్క టీజర్ ను ఈరోజు సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ప్రముఖ హీరోలైన రానా దగ్గుబాటి తెలుగు వెర్షన్, ధనుష్ తమిళ వెర్షన్, నివిన్ పౌలీ మలయాళ వెర్షన్, రక్షిత్ శెట్టి కన్నడ వెర్షన్ ను రిలీజ్ చేయనున్నారు. ఇకపోతే కార్తిక్ సుబ్బరాజ్ తన తరవాతి సినిమాను సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేయనున్నాడు.

 
Like us on Facebook