రిలీజ్ కు ముందే సినిమా చూపించిన సెన్సేషనల్ హీరో !
Published on Nov 3, 2016 12:22 pm IST

VIJAY-ANTONY
ఈ మధ్య కాలంలో తెలుగులో పరిశ్రమలో నమోదైన సంచలన విజయాలలో తమిళ డబ్బింగ్ చిత్రం ‘బిచ్చగాడు’ సక్సెస్ కూడా ఒకటి. అతి సామాన్యమైన సినిమాగా వచ్చి అసామాన్య విజయం సొంతం చేసుకుంది ఈ చిత్రం. దీంతో ఇందులో హీరోగా నటించిన విజయ్ ఆంటోనీకి తెలుగులో యమ క్రేజ్ క్రియేటైంది. ఇప్పుడు ఆయన సినిమా కోసం ఎదురుచూసే ప్రేక్షకులు తెలుగులో కూడా తయారయ్యారు. ఆ ఉత్సాహంతోనే ఆంటోనీ తన తాజా చిత్రం ‘సైతాన్’ ను తెలుగులో ‘భేతాళుడు’ పేరుతో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

అలాగే తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈరోజు జరుగుతున్న ఆడియో వేడుకలో విజయ్ ఆంటోనీ తన సినిమా మొదటి 5 నిముషాలు అక్కడికి హాజరైన ప్రెస్ కు ప్రత్యేకంగా ట్రైలర్ తో పాటు చూపించాడట. ఆ 5 నిముషాల షో చూసిన వారందరూ సినిమాను మెచ్చుకుంటున్నారట. అలాగే సినిమాపై ఎంత నమ్మకం లేకపోతే ఆంటోనీ, దర్శకుడు విజయ్ కృష్ణమూర్తి రిలీజ్ కు ముందే సినిమాలో కొంత భాగాన్ని చూపుతారు అంటూ ప్రసంశలు వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే విజయ్ ఆంటోనీ స్వయంగా నిర్మించిన ఈ ఈ సైకలాజికల్ థ్రిల్లర్ నవంబర్ 18న తమిళ్ తో పాటు తెలుగులో కూడా ‘భేతాళుడు’ పేరుతో విడుదలకానుంది.

 
Like us on Facebook