వజ్రాల వ్యాపారి హత్య కేసులో ప్రముఖ నటి ?

Published on Dec 9, 2018 12:53 pm IST

వజ్రాల వ్యాపారి రాజేశ్వర్ కిశోరీలాల్ ఉదాని హత్య కేసులో ప్రముఖ టీవీ సీరియల్ నటి పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిచడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. డాన్స్‌ ఇండియా డాన్స్‌ అనే షోతో టెలివిజన్‌ లోకి ఎంట్రీ ఇచ్చిన బెంగాలీ నటి దేవలీనా భట్టాచార్జీ ఆ తరువాత ‘సాథ్‌ నిభాయా సాథ్‌లో గోపీ బహూ’ పాత్ర ద్వారా బాగా ఫేమస్ అయింది. ఇదే సీరియల్‌ ‘కోడలా కోడలా కొడుకు పెళ్లామా’ పేరుతో తెలుగులోకి డబ్‌ అయింది.

కాగా వజ్రాల వ్యాపారి కిశోరీ లాల్ కనబడకుండా పోవకముందు దేవలీనా భట్టాచార్జీ అతని ఇంటికే వెల్లిందని, అక్కడి నుండి ఆమె బయటకు వెళ్లిన తర్వాతే రాజేశ్వర్ కిశోరీలాల్ కనిపించకుండాపోయారని, అందుకే దేవలీనా భట్టాచార్జీ విచారిస్తున్నామని ముంబై పోలీసులు తెలిపారు. ఇంతకీ రాజేశ్వర్ కిశోరీలాల్ హత్య కేసులో దేవలీనా భట్టాచార్జీ పాత్ర ఉంటే ఇక ఆమె టెలివిజన్ కెరీర్ ముగిసిపోయినట్లే.

సంబంధిత సమాచారం :