ఇంటర్వ్యూ : శర్వానంద్ – పడి పడి లేచె మనసు లో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ హైలైట్ అవుతుంది !

Published on Dec 19, 2018 6:06 pm IST

యువ హీరో శర్వానంద్ , సాయి పల్లవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘పడి పడి లేచె మనసు’. ఈచిత్రం ఈనెల 21న విడుదలవుతున్న సందర్బంగా హీరో శర్వానంద్ మీడియా తో మాట్లాడారు . ఆ విశేషాలు మీకోసం ..

ఈచిత్రం రిజల్ట్ గురించి ఏమైనా టెంక్షన్ పడుతున్నారా ?

లేదు . నాకు చాలా సంతోషంగా వుంది చిత్రం బాగా వచ్చింది. ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని ఆదరిస్తారనుకుంటున్నాను.

కలకత్తా లో ఈ చిత్రాన్ని షూట్ చేశారు ఏమైనా ప్రత్యేకమైన కారణం వుందా ?

మా దర్శకుడు హను రాఘవపూడి ఈ లవ్ స్టోరీ ని ఫ్రెష్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించాలనుకున్నాడు. అందుకని ఆ ప్లేస్ ని ఎంచుకున్నాం. అలాగే ఆ సిటీ లో తీసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి ఆ సెంటిమెంట్ కూడా దీనికి వర్క్ అవుట్ కావాలనుకుంటున్న.

హను గత చిత్రం లై నిరాశపరించింది అయినా ఏ నమ్మకంతో ఆయనకు ఛాన్స్ ఇచ్చారు ?

ఆయన చాలా మంచి టెక్నీషియన్. నాకు , తను 10 సంవత్సరాలుగా తెలుసు అండ్ ఆయన నరేషన్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే ఆయన లవ్ స్టోరీ ని బాగా తీయగలడని తెలిసే అతన్ని చూజ్ చేసుకున్నాను.

ఈ చిత్రం దేని గురించి ఉండనుంది ?

లీడ్ పెయిర్ యొక్క వ్యక్తిత్వాల తో హను రూపకల్పన చేసిన సింపుల్ ప్రేమ కథ ఈచిత్రం . హీరో మరియు హీరోయిన్ల మధ్య ఉన్న కెమిస్ట్రీ ఈ చిత్రంలో హైలైట్ అవుతుంది.

మీ పాత్ర గురించి ?

ఈ సినిమాలో సూర్య అనే పాత్రలో నటించాను. నేను ఫుట్ బాల్ ఆడతాను కాని మెయిన్ స్టోరీ లో దీని గురించి ఎక్కువగా ప్రస్తావన ఉండదు.

మీ హీరోయిన్ గురించి ?

సాయి పల్లవి చాలా మంచి నటి. ఆమె తోటి నటీనటులతో చాలా మర్యాదగా ఉంటుంది. ఈచిత్రంలో మా కెమిస్ట్రీ గురించి అందురు మాట్లాడుకుంటారు. మా నుండి ఈ సినిమాకు బెస్ట్ ఇచ్చాం అనుకుంటున్నాం.

సునీల్ పాత్ర గురించి ?

ఆయన పాత్ర చాలా బాగుంటుంది అలాగే గుర్తిండిపోయే పాత్రలో నటించారు. ఆయన పాత్ర గురించి నేను ఎక్కువగా రివీల్ చేయలేను.

మీ పోనీటైల్ లుక్ గురించి ?

ప్రత్యేకించి వేరే కారణం లేదు. ఏడాది నుంచి ఈ సినిమా కోసం జుట్టు పెంచాను అందుకని హెయిర్ కట్ చేసుకున్నాను. ఇది జస్ట్ క్యాజువల్ లుక్ మాత్రమే.

సంబంధిత సమాచారం :