మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న శర్వానంద్ కొత్త సినిమా
Published on Oct 4, 2016 12:45 pm IST

sharwanand
‘ఎక్స్ ప్రెస్ రాజా’ విజయం తరువాత హీరో శర్వానంద్ చేస్తున్న కొత్త చిత్రం ‘శతమానంభవతి’. టాలీవుడ్ రచయిత ‘సతీష్ వేగేశ్న’ డైరెక్టర్ గా మారి చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ప్రసుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం నిన్నటితో మొదటి స్కీహేడులే ను పూర్తి చేసుకుని రెండవ షెడ్యూల్ ను ప్రారంభించే పనిలో ఉంది.

ఈ చిత్రంలో శర్వానంద్ సరసన మలయాళీ బ్యూటీ, ‘ప్రేమమ్, అ.. ఆ’ చిత్రాల ఫేమ్ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. పూర్తి స్థాయి లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో మొదట వరుణ్ తేజ్, రాజ్ తరుణ్ వంటి వాళ్ళను హీరోలుగా అనుకున్న చివరికి శర్వానంద్ ను ఫిక్స్ చేశారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో జయసుధ, ప్రకాష్ రాజ్ వంటి సీనియర్ నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు నిర్మాత దిల్ రాజు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 

వీక్షకులు మెచ్చిన వార్తలు