“లియో” కి బుల్లితెర పై షాకింగ్ రెస్పాన్స్!

“లియో” కి బుల్లితెర పై షాకింగ్ రెస్పాన్స్!

Published on Jan 26, 2024 11:29 AM IST

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ లియో. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడం జరిగింది. ఈ చిత్రం ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రముఖ టీవీ ఛానల్ అయిన జెమిని టీవీ లో ప్రసారం అయ్యింది.

అయితే ఈ సినిమాకి షాకింగ్ రెస్పాన్స్ వచ్చింది. కేవలం 3.0 టీఆర్పీ రేటింగ్ ను రాబట్టడం జరిగింది. విజయ్ లాంటి స్టార్ హీరో సినిమా, సూపర్ హిట్ మూవీ కి ఎలాంటి రెస్పాన్స్ షాకింగ్ అనే చెప్పాలి. ఈ చిత్రం లో త్రిష హీరోయిన్ గా నటించగా సంజయ్ దత్, అర్జున్, ప్రియా ఆనంద్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అనిరుద్ రవి చందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు