మైథలాజికల్ థ్రిల్లర్ ‘త్రికాల’ రిలీజ్ డేట్ ఖరారు

మైథలాజికల్ థ్రిల్లర్ ‘త్రికాల’ రిలీజ్ డేట్ ఖరారు

Published on May 17, 2026 8:00 AM IST

శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలో నటించిన మైథలాజికల్ థ్రిల్లర్ ‘త్రికాల’ మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. సనాతన ధర్మంలోని రహస్యాల ఆధారంగా దర్శకుడు మణి తెల్లగూటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాధిక–శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాను చాగంటి ప్రొడక్షన్ LLP సంస్థ భారీస్థాయిలో థియేటర్లలోకి తీసుకొస్తోంది.

​ఆధునిక సాంకేతికత, హై-క్వాలిటీ వీఎఫ్ఎక్స్ (VFX) ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మాస్టర్ ఫేమ్ మహేంద్రన్, అజయ్, సీనియర్ నటి ఆమని ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం ఈ చిత్రానికి మరో బలం.

​ప్రపంచాన్ని చీకటి కమ్ముకున్న సమయంలో వెలుగుగా అవతరించే శక్తి చుట్టూ ఈ కథ తిరుగుతుందని దర్శకుడు మణి తెల్లగూటి తెలిపారు. ఆధ్యాత్మికతకు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమాను రూపొందించారు. నార్త్ ఇండియాలోనూ ఈ చిత్రానికి మంచి బిజినెస్ జరిగిందని, ఫ్యాన్సీ రేటుకు హిందీ శాటిలైట్, డబ్బింగ్ హక్కులు అమ్ముడయ్యాయని నిర్మాతలు వెల్లడించారు. సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ‘త్రికాల’ ప్రేక్షకులకు కచ్చితంగా కొత్త అనుభూతిని పంచుతుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

తాజా వార్తలు