నాగ్ ‘బంగార్రాజు’లో మరో హీరోయిన్ ?

Published on Jul 26, 2021 5:32 pm IST

అక్కినేని నాగార్జున సూపర్ హిట్ సినిమా ‘సోగ్గాడే చిన్నినాయన’ సీక్వెల్ ‘బంగార్రాజు’ ఆగస్టు సెకండ్ వీక్ నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలు కాబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇక నాగార్జున సరసన ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో సీనియర్ హీరోయిన్ శ్రియా సరన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె కోసం ఒక క్యారెక్టర్ డిజైన్ చేశారట.

ఇక ఈ సినిమాలో నాగచైతన్య కూడా కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే చైతుకి జోడీగా క్రేజీ హీరోయిన్ కృతిశెట్టి నటించబోతుంది. ‘మనం’ తర్వాత నాగార్జున – నాగచైతన్య కలిసి నటిస్తున్న చిత్రం ఇదే. సంక్రాంతికి విడుదల చేయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తారు. ‘సోగ్గాడే… ’ చిత్రంతోనే పరిచయమైన కళ్యాణ్ కృష్ణ ‘బంగార్రాజు’తో మళ్ళీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.

నిజానికి ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ.. అనుకున్న సమయానికి బంగార్రాజు సినిమా సెట్స్ పైకి వెళ్ళలేకపోయింది. మొత్తానికి ‘బంగార్రాజు’ రాక ఆలస్యం అయినా, ఆసక్తి ఉండేలా ఉంది.

సంబంధిత సమాచారం :