వాయిదాపడ్డ శృతి హాసన్ బాలీవుడ్ చిత్రం !
Published on May 24, 2017 9:47 am IST


తెలుగు, తమిళ పరిశ్రమల్లోని స్టార్ హీరోయిన్లలో ఒకరైన శృతి హాసన్ ఒక పరిరమకే పరిమితం కాకుండా వరుసగా అన్ని ప్రధాన భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. తాజాగా హిందీలో ఆమె నటించిన ‘బెహన్ హోగి తేరి’ చిత్రం అన్ని పనుల్ని పూర్తి చేసుకుని రిలీజుకు సిద్ధంగా ఉంది. అయితే ముందుగా ఈ చిత్రాన్ని జూన్ 2వ తేదీన రిలీజ్ చేయాలని అనుకోగా అది కాస్త వాయిదాపడింది.

ఎందుకంటే జూన్ 2వ తేదీన హాలీవుడ్ సినిమాలైన ‘వండర్ ఉమెన్’, ప్రియాంక చోప్ర నటించిన ‘బె వాచ్’ చిత్రాలు భారీ ఎత్తున రిలీజ్ కానున్నాయి. అందుకే అంత పోటీ మధ్య చిత్రాన్ని విడుదలచేయడం మంచిది కాదని భావించిన నిర్మాతలు జూన్ 9ని కొత్త విడుదల తేదీగా నిర్ణయించారు. పూర్తి స్థాయి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉందనున్న ఈ చిత్రంలో శృతి సరసన రాజ్ కుమార్ రావ్ హీరోగా నటిస్తుండగా అజయ్ పన్నాలాల్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు.

 
Like us on Facebook