సమీక్ష : శుభలేఖ+లు – ఆసక్తి కలిగించని కుటుంబ కథా చిత్రం

సమీక్ష : శుభలేఖ+లు – ఆసక్తి కలిగించని కుటుంబ కథా చిత్రం

Published on Dec 8, 2018 3:00 AM IST
ShubhalekhaLu movie review

విడుదల తేదీ : డిసెంబర్ 07, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : సాయి శ్రీనివాస్, దీక్షా శర్మ, ప్రియా వడ్లమాని, వంశీ నెక్కంటి, మోనా బేద్రే, అప్పాజీ, తదితరులు.

దర్శకత్వం : శరత్ నర్వాడే

నిర్మాత : సి విద్యాసాగర్, ఆర్.ఆర్. జనార్ధన్

సంగీతం : కె యమ్ రాధాకృష్ణ

సినిమాటోగ్రఫర్ : మురళీమోహన్ రెడ్డి

ఎడిటర్ : మధు

నూతన దర్శకుడు శరత్ నర్వాడే దర్శకత్వంలో సాయి శ్రీనివాస్, దీక్షా శర్మ హీరోయిన్లుగా వచ్చిన చిత్రం ‘శుభలేఖ+లు’. కాగా ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం.. ఏ మేరకు ప్రేక్షకుల్ని మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

చందు (సాయి శ్రీనివాస్)కి క్రియేటివ్ ఫీల్డ్ అంటే ఇంట్రస్ట్. ఓ సాంగ్ ను డైరెక్ట్ కూడా చేస్తాడు. కానీ ఇంట్లోవాళ్లకి మరియు బంధువులకి అతను ఖాళీగా తిరుగుతున్నట్లు అనిపిస్తోంది. ఈ క్రమంలో చందు తన స్టెప్ సిస్టర్ నిత్య (ప్రియా వడ్లమాని) పెళ్లికి ఇంటికి వస్తాడు. కానీ తన సవతి తల్లితో పాటు మిగిలిన కుటుంబ సభ్యులు కూడా చందుని పెద్దగా పట్టించుకోరు. అయితే అప్పటికే తన మరదలు శిరీష్ (దీక్ష శర్మ) తో చందు ప్రేమలో ఉంటాడు. ఈ క్రమంలో కొన్ని సంఘటనలు అనంతరం నిత్య వేరే అతన్ని ప్రేమిస్తోందని పెళ్లి మానుకొని ఎవ్వరికీ చెప్పకుండా అతనితో లేచి పోవటానికి ప్లాన్ చేస్తోందని చందు తెలుసుకుంటాడు.

నిత్య అలా చేస్తే తమ కుటుంబ పరువు పోతుందని ఆమెను ఆ ప్రయత్నం విరమించుకున్నేలా చందు ఏమి చేశాడు ? ఆ తరువాత జరిగే నాటకీయ పరిణామాల అనంతరం నిత్య పెళ్లి సజావుగా సాగిందా లేదా ? చివరకి చందు, శిరీష ఒక్కటయ్యారా లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్ర హీరో సాయి శ్రీనివాస్ కి హీరోగా మొదటి సినిమా అయినప్పటికీ అతని లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా చాలా ఫిట్ గా బాగున్నాడు. తన స్టెప్ మదర్ తనపట్ల దురుసుగా ప్రవర్తించే సందర్భాల్లో గాని, అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో గాని తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకొన్నే ప్రయత్నం చేశాడు. మరియు ముఖ్యంగా హీరోయిన్ తో సాగే కొన్ని ప్రేమ సన్నివేశాల్లో కూడా సాయి శ్రీనివాస్ చాలా చక్కగా నటించాడు.

ఇక హీరోయిన్ గా నటించిన దీక్షా శర్మ కూడా తన నటనతో ఆకట్టుకుంది. రొమాంటిక్ సన్నివేశాలతో పాటు, కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కూడా దీక్షా శర్మ తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన ప్రియా వడ్లమాని తన గ్లామర్ తోనూ తన నటనతోనూ ఆకట్టుకుంటుంది. హీరోకి పెద్దనాన్నగా నటించిన నటుడు కూడా తన కెరీర్ లోనే గుర్తు పెట్టుకున్నే పాత్ర ఈ సినిమాలో చేశారు. ఆయన తిడుతూ పలికిన మాటలు బాగానే అలరించాయి. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు.

మైనస్ పాయింట్స్:

సినిమా కొన్ని చోట్ల పర్వాలేదు అనిపించినా, ఓవరాల్ గా నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టిస్తోంది. సినిమాలో ఎక్కడా బలమైన సంఘర్షణ గాని ఇంట్రస్ట్ గాని లేదు. దానికి తోడు క్యారెక్టర్ జేషన్స్ కూడా బలంగా అనిపించవు. ఇక సెకెండాఫ్ ని ఎమోషనల్ గా నడుపుదామని దర్శకుడు బాగానే ప్రయత్నం చేశాడు, కాకపోతే ఎక్కడా ఆ ఎమోషన్ గాని, ఆ ఫీల్ గాని ఆడియన్స్ ఫీల్ అవ్వరు. వీటికి తోడు కొన్ని సన్నివేశాలు మరీ నాటకీయంగా సాగుతాయి.

మొత్తానికి ఈ రెగ్యూలర్ లవ్ స్టోరీలో బలహీనమైన పాత్రలతో కొన్ని భావోద్వేగ సన్నివేశాలను పండించడానికి దర్శకుడు కథనంలో అనవసరమైన లవ్ ట్రాక్స్ మరియు సీన్స్ పెట్టి విసిగిస్తాడు. పైగా ఆ సీన్స్ కూడా ఎక్కడా హృదయానికి హత్తుకున్నే విధంగా ఉండకపోగా.. చాలా చోట్ల సినిమాటెక్ గా సాగుతూ.. చాలా ప్రెడిక్టుబుల్ గా అనిపిస్తాయి.

లవ్ అండ్ రొమాంటింక్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో.. ప్రేక్షకులను ఇటు పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచే లవ్ ఉండదు, అటు పగలబడి నవ్వుకున్నే ఎంటర్ టైన్మెంట్ ఉండదు. దర్శకుడు సినిమాలో మంచి కాన్ ఫ్లిక్ట్ పెట్టి ఉండి ఉంటే ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నేది.

సాంకేతిక విభాగం :

సినిమాలో దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ బాగున్నా.. సినిమాలో బలమైన కాన్ ఫ్లిక్ట్ మిస్ అయింది. దాంతో సినిమా ఆసక్తి కరంగా సాగదు. సంగీత దర్శకుడు కె యమ్ రాధాకృష్ణ సమకూర్చున పాటలు పర్వాలేదనిపిస్తాయి.

మురళీమోహన్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకి తగ్గట్లే ఉంది. అయితే సన్నివేశాలను మంచి విజువల్ గా చిత్రీకరించారు. ఇక మధు ఎడిటింగ్ బాగున్నప్పటికీ, సినిమాలో కథకు అవసరం లేకుండా వచ్చే కొన్ని సీన్స్ ను ట్రిమ్ చేసి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. ఈ చిత్ర నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువులు బాగున్నాయి.

తీర్పు:
నూతన దర్శకుడు శరత్ నర్వాడే దర్శకత్వంలో సాయి శ్రీనివాస్, దీక్షా శర్మ హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం ఆసక్తి కరంగా సాగలేదు. దర్శకుడు స్క్రిప్టుని ఇంకా పగడ్బందీగా మలచుకోని ఉండి ఉంటే.. దర్శకుడి కష్టానికి ఫలితం దక్కేది. కానీ సినిమాలో బలమైన కాన్ ఫ్లిక్ట్ లేకపోవడం, హీరో హీరోయిన్ల ప్రేమ కథ, వారి మధ్య సాగే కొన్ని సన్నివేశాలు ఇంట్రస్ట్ గా సాగకపోవడం, వీటికి తోడు నెమ్మదిగా సాగే కథనం, కొన్ని సీన్స్ కన్వీన్స్ గా అనిపించకపోవడం లాంటి కారణాలతో సినిమా ఫలితం దెబ్బ తింది. కాకపోతే కథలోని కీలక మైన ఎమోషనల్ కంటెంట్ బాగుంది. కానీ, ఆ కంటెంట్ కి తగట్లు కథ కథనాలను మాత్రం దర్శకుడు ఆకట్టుకున్నే విధంగా రాసుకోలేకపోయాడు. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు