వాయిదా పడిన సిద్ధార్థ్ సినిమా !
Published on Nov 8, 2017 3:01 pm IST

హీరో సిద్ధార్థ్ ఒకప్పుడు వరుసగా తెలుగు సినిమాలు చేస్తూ సక్సెస్ లో ఉండేవాడు. కానీ రాను రాను తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో ఈ హీరో తమిళ్ లో ఎక్కువ సినిమాలు చేస్తూ వచ్చాడు. చాలా కాలం తరువాత ఈ హీరో నటించిన హార్రర్ సినిమా ‘గృహం’ తెలుగులో విడుదల కానుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకే రోజు నవంబర్ 3న సినిమా విడుదల చేయాలని మొదట అనుకున్నారు. కాని కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ సినిమా తెలుగులో విడుదల కాలేదు.

గతవారం తమిళ్ లో ‘అవల్’ పేరుతో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాదించింది. తెలుగులో మూడో తేది విడుదల కావాల్సిన ‘గృహం’ థియేటర్స్ దొరక్క విడుదల వాయిదా పడింది. ఆ తరువాత నవంబర్ 10 న విడుదల కానుందని సిద్ధార్థ్ స్వయంగా ప్రకటించాడు. కాని ఈ శుక్రవారం గృహం ప్రేక్షకుల ముందుకు రావడంలేదు. కారణాలు తెలియనప్పటికీ త్వరలో కొత్త విడుదల తేదిని ప్రకటించే అవకాశం ఉంది. సిద్ధార్థ్ కు ఈ సినిమా మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుందాం.

 
Like us on Facebook