చప్పుడు లేని సమంత వెబ్ సిరీస్.!

చప్పుడు లేని సమంత వెబ్ సిరీస్.!

Published on Dec 6, 2023 11:00 AM IST

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటించిన లాస్ట్ చిత్రం “ఖుషి” తో తన కెరీర్ లో మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత సమంత ఒక ఏడాది గ్యాప్ తీసుకుంటున్నట్టుగా తెలిపింది. అయితే ఆమె ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఈ ట్రీట్మెంట్ కన్నా ముందు సమంత అప్పుడు ఖుషి తో పాటుగా ఓ భారీ వెబ్ సిరీస్ ని కూడా చేసింది.

అదే ప్రైమ్ వీడియోలో చేసిన “సిటాడెల్”. అయితే ఈ సిరీస్ ని సమంత అప్పుడే కంప్లీట్ చేసింది. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఈ సిరీస్ విషయంలో ఇంకా చప్పుడు లేదు. దీనితో ఈ సిరీస్ నిలిచిపోయిందా లేక ఇంకా సమయం తీసుకుంటున్నారా లేక దీని ఒరిజినల్ వెర్షన్ ఇంగ్లీష్ లో అంత గొప్ప రెస్పాన్స్ రాకపోవడం వల్ల ఏమన్నా ఆపేసారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు