ఊర్వశివో రాక్షసివో సినిమాతో అల్లు శిరీష్ హిట్ కొడతాడా?

ఊర్వశివో రాక్షసివో సినిమాతో అల్లు శిరీష్ హిట్ కొడతాడా?

Published on Nov 3, 2022 8:57 PM IST


ఊర్వశివో రాక్షశివో సినిమా గత కొన్ని రోజులుగా ఆడియెన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసింది. శిరీష్ చివరి సినిమా వచ్చి చాలా రోజులైంది. తన సినిమా విడుదలకు చాలా సమయం పట్టింది. కానీ, ఈసారి మాత్రం తప్పకుండా క్లిక్ అవుతుందని శిరీష్ అన్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

రిలీజైన ప్రచార చిత్రాల్లో అల్లు శిరీష్ ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రం లో శిరీష్ సరసన హీరోయిన్ గా అను ఇమ్మాన్యుయేల్‌ నటించింది. ఇందులో వీరిద్దరి మధ్యన కెమిస్ట్రీ బాగున్నట్లు రిలీజైన ప్రోమోలు చూస్తే తెలుస్తుంది. ఓ ఇంటర్వ్యూలో శిరీష్ మాట్లాడుతూ, కాలం మారిందని, వైవిధ్యమైన పాత్రలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. ఈ వారంలో అనేక ఇతర చిన్న చిత్రాలతో ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం హిట్ పై అల్లు శిరీష్ ఎన్నో హోప్స్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఊర్వశివో రాక్షశివో చిత్రం అతనికి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు