శివ కార్తికేయన్ “డాన్” రిలీజ్ డేట్ ఫిక్స్!

శివ కార్తికేయన్ “డాన్” రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on Jan 31, 2022 11:45 AM IST


హీరో శివ కార్తికేయన్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. శివ కార్తికేయన్ హీరోగా సిబి చక్రవర్తి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం డాన్. ఈ చిత్రం లో ప్రముఖ నటుడు, డైరక్టర్ ఎస్. జే సూర్య కీలక పాత్ర లో నటిస్తున్నారు. ఈ చిత్రం లో శివ కార్తికేయన్ సరసన హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. లైకా ప్రొడక్షన్స్ మరియు శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్ పతాకాల పై ఈ చిత్రాన్ని అల్లిరజః సుబస్కరన్ మరియు శివ కార్తికేయన్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం విడుదల తేదీ పై చిత్ర యూనిట్ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాను మార్చ్ 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. తాజాగా రిలీజ్ డేట్ ను ఒక వీడియో ద్వారా ప్రకటించడం తో అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ విషయం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు