ఆ సినిమాలో శ్రీ విష్ణు పాత్ర డిఫరెంట్ గా ఉండబోతోంది !
Published on Jan 12, 2018 12:20 pm IST

నారా రోహిత్, సుదీర్ బాబు నటిస్తోన్న సినిమా ‘వీరభోగ వసంతరాయలు’. అప్పారావు బెల్లన నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో శ్రియ హీరోయిన్ గా నటిస్తోంది. నూతన దర్శకుడు ఆర్. ఇంద్రసేన దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో శ్రీ విష్ణు ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. అతని గెటప్ బాడి లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉండబోతున్నాయని సమాచారం.

సమాజంలోని చీకటి వెలుగుల్ని ఆవిష్కరించే కథగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ప్రతీ పాత్ర కొత్తగా ఉండబోయే ఈ సినిమా కథ నచ్చి ముగ్గురు హీరోలు సైన్ చెయ్యడం విశేషం. సత్యదేవ్‌, శశాంక్‌, చరిత్‌ మానస్‌, స్నేహిత్‌, రవి ప్రకాష్‌ నటిస్తోన్న ఈ సినిమా వైవిధ్యంగా ఉండబోతోందని సమాచారం. సతీష్‌ రఘునాధన్‌ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు హిస్టిన్‌ – శేఖర్‌ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.

 
Like us on Facebook