‘మదర్’గా కనిపించనున్న శ్రీదేవి

‘మదర్’గా కనిపించనున్న శ్రీదేవి

Published on Mar 17, 2015 8:27 AM IST

sridevi
ఇండియన్ ఎవర గ్రీన్ బ్యూటీ శ్రీదేవి, దాదాపు 20 సంవత్సరాల గ్యాప్ తర్వాత చేసిన సినిమా ‘ఇంగ్లీష్ వింగ్లీష్’. ఆ తర్వాత వచ్చే కథలన్నిటినీ ఎంచుకోకుండా ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీదేవి తమిళంలో విజయ్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో నటిస్తోంది. ఇది కాకుండా తాజాగా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మనసుకు హత్తుకునే మదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాకి ‘మదర్’ అనే టైటిల్ ని ఖరారు చేసారు.

ఈ సినిమాలో శ్రీదేవి డాటర్ గా ఓ కొత్త హీరోయిన్ కనిపించనుంది. మొదట్లో ఈ డాటర్ పాత్రకి అక్షర హాసన్ ని కూడా పరిశీలించారు. మరి ఎవరు శ్రీదేవి కుమార్తెగా చేస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. గతంలో పలు సక్సెస్ఫుల్ వాణిజ్య ప్రకటనలు చేసిన రవి వడయార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీదేవి భర్త, బాలీవుడ్ ఫేమస్ ప్రొడ్యూసర్ బోణీ కపూర్ ఈ సినిమాని నిర్మించనున్నాడు. శ్రీదేవి కి ఉన్న పాపులారిటీ ని క్యాష్ చేసుకోవడం కోసం ‘మదర్’ సినిమాని హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నిర్మించనున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు