శ్రీకాంత్ సినిమా విడుదల తేది ఖరారు !

శ్రీకాంత్ హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా శ్రీమిత్ర చౌదరి సమర్పణలో శ్రీకాంత్ హీరోగానటిస్తోన్న సినిమా రా రా. శ్రీకాంత్ సరసన నజియా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 23న విడుదల కానుంది. ఈ మద్య అనంతపురం లో జరిగిన టాలీవుడ్ క్రికెట్ మ్యాచ్ లో ఈ సినిమా ఆడియో విడుదల చేసారు.

కామెడి హర్రర్ ధ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా విజి చరిష్ విజన్స్ పతాకంపై నిర్మించబడింది. గిరిబాబు, అలీ, పోసాని, ప్రుద్వి ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. విజి చరిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రాప్ రాక్ సంగీతం అందించారు. మనుషులకు, దెయ్యాలకు మద్య జరిగే సరదా సన్నివేశాలతో ఈ సినిమా ఉండబోతోంది.